Sep 30,2023 21:13

సమావేశంలో మాట్లాడుతున్న శ్యాంసుందర్‌ రెడ్డి

కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఎపిటిఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ. శ్యాంసుందర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎపిటిఎఫ్‌ రాష్ట్ర సంఘ పిలుపు పిలుపుమేరకు శనివారం కలెక్టరేట్‌ ఎదుట ఎపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. రాష్టంలోని 3 లక్షల మంది సిపిఎస్‌ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత జిపిఎస్‌ అనే కొత్త పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడం సిపిఎస్‌ ఉద్యోగులను మోసగించడమేనన్నారు. జిపిఎస్‌ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రాష్టంలోని ఉద్యోగులందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. 2023 జులై నుంచి మధ్యంతర బతిని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు విడతల డిఎ లను ప్రకటించాలన్నారు. 11వ పిఆర్‌సి బకాయిలను వాయిదాల పద్దతిలో కాకుండా ఏక మొత్తంగా చెల్లించాలన్నారు. ప్రాథమిక పాఠశాల వ్యవస్ధను నిర్వీర్యం చేసిన జిఒ 117ను రద్దు చేయాలన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్సి పాఠశాల తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను భయబ్రాంతులకు గురిచే స్తున్నారని ఆయన వైఖరి తీరును మార్చుకోవాలన్నారు. పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ రుణాలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు ఏడాదైనా ారికి డబ్బులను చెల్లించడం లేదన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్‌ను రూపొందించడంతో పాటు ఉద్యోగోన్నతులు చేపట్టాలన్నారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులను మంజూరు చేయాలన్నారు. ఆదర్శపాఠశాలల ఉపాధ్యాయులకు సర్వీసు రూల్స్‌ను రూపొందించాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో స్పందనలేదన్నారు. త్వరలో ఎపిటిఎఫ్‌ రాష్ట వ్యాప్త ఉద్యమం చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌ రెడ్డి,నాగరాజు, రాష్ట కౌన్సిలర్లు క్రిష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఖాదర్‌బాష, గురయ్య రాష్టకౌన్సిలర్‌ సురేంద్రనాధరెడ్డి, జిల్లా కార్యదర్శులు, మునివర్దన్‌ కుమార్‌, రమేష్‌ రెడ్డి, రామ్‌ భూపాల్‌రెడ్డి, సుబ్బయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రంగయ్య ,శ్రీనివాసులురెడ్డి, రామచంద్రారెడ్డి, బాబు, శ్రీనివాసులు జిల్లాకౌన్సిలర్లు సయ్యద్‌బాష, మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ,అబ్ధుల్‌ సత్తార్‌,బాలజ్యోజి, హరినాథ్‌ ,మల్లికార్జున, చంధ్రశేఖర్‌, జాన్‌ సురేష్‌, విష్ణువర్ధన్‌, నరసింహారెడ్డి, రామ సుధాకర్‌ రెడ్డి, బాబుల్‌ రెడ్డి, ఖాసీం, మణికుమార్‌తో పాటు జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు దాదాపుగా 200 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.