Jun 17,2023 18:20

ఉపాధ్యాయ డైరీ లను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్సీ
ప్రజాశక్తి - చాగలమర్రి

      ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రా రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పిఆర్‌టియు కార్యాలయం వద్ద పిఆర్‌టియు మండల శాఖ రూపొందించిన ఉపాధ్యాయ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పిఆర్‌టియు మండల అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మౌలాలి, రాష్ట్ర నాయకులు రవీంద్రారెడ్డి, నారాయణమూర్తి, రషీద్‌, అహమ్మద్‌, దాదాపీర్‌, రవిశంకర్‌ రెడ్డి, షాకీర్‌, ఓబులపతి, సురేష్‌ బాబు, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.