Mar 06,2023 21:17

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్‌

ఉపాధ్యాయ నిరుద్యోగ హక్కుల కోసం
ప్రశ్నించే వారిని ఎమ్మెల్సీలుగా గెలిపిద్దాం
- మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్‌
- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    ఉపాధ్యాయ, నిరుద్యోగ హక్కుల కోసం ప్రశ్నించే వారిని ఎమ్మెల్సీలుగా గెలిపిద్దామని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్‌ పేర్కొన్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు విజయం కోసం నంద్యాల పట్టణంలోనిఎస్పీజి హైస్కూల్‌, హౌలీ క్రాస్‌, సెయింట్‌ జోషేప్‌, సెయింట్‌ జాన్స్‌, సిఎస్‌ఐ, మోడల్‌, మార్నింగ్‌ స్టార్‌, నవజ్యోతి అంధుల పాఠశాల, నారాయణ విద్యాసంస్థల్లో సోమవారం విస్తత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగుల న్యాయమైన సమస్యలపై ప్రశ్నించే వారిని గెలవనీయకుండా అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని అన్నారు. నోట్లతో ఓట్లు కొనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని అన్నారు. క్రిస్టియన్‌ మైనార్టీలకు, ఆయా విద్యాసంస్థలకు ఎటువంటి నిధులు ఇవ్వడం లేదని, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, వారి ఆస్తులకు రక్షణ లేదని తెలిపారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు వారి విద్యా సంస్థలు రెన్యువల్‌ 10 సంవత్సరాలు ఉండగా 3 సంవత్సరాలకు కుదించడం దారుణమన్నారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యం పిల్లలకు రావాల్సిన బుక్స్‌ కోసం డబ్బులు కట్టించుకొని ఇంత వరకు బుక్స్‌ రాలేదని, ఆ అంశం గురించి ఏ ఒక్క మాట కూడా మాట్లాడని అదే ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యం నుండి పోటీ చేస్తున్న వారికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని అన్నారు. అందుకోసమే పిడిఎఫ్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు, ఇన్సాఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్‌, ఎఐటియుసి మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌.రంగనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనుంజయ, బికేఎంయు జిల్లా అధ్యక్షుడు సుబ్బరాయుడు, రైతు సంఘం జిల్లా కో కన్వీనర్‌ సోమన్మ తదితరులు పాల్గొన్నారు. మిడుతూరు : విద్యావంతులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు కోరారు. మిడుతూరులో వ్యకాసం మండల అధ్యక్షులు టి.ఓబులేసు, సిఐటియు మండల అధ్యక్షులు లింగస్వామి, గ్రామస్తులు సుజ్ఞానం, జయరాముడు తదితరులు కలిసి ప్రవేట్‌ స్కూల్స్‌, కస్తూర్బా స్కూల్స్‌, మోడల్‌ స్కూల్‌, ఎంపీడీవో, ఎమ్మార్వో, హాస్పిటళ్లలో పట్టుభద్రులను కలిసి పిడిఎఫ్‌ బలపరిచిన పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. పోతల నాగరాజును 175 ప్రజాసంఘాలు, జనసేన, కాంగ్రెస్‌ పార్టీ బలపరుస్తున్నాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు : పిడిఏఫ్‌ ఎమ్మెల్శీ అభ్యర్థులు డాక్టర్‌ పోతుల నాగరాజుకి, టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహ రెడ్డికి మొదటి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతు సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి ఏ.రాజశేఖర్‌, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మునిపాటి చిన్న మారెన్న, మండల కార్యదర్శి డి.నాగరాజు, జి.నాగసైదయ్య, మండలసహయ కార్యదర్శి యం మల్లికార్జున, భవన నిర్మాణ సంఘం అద్యక్షులు ఏ.రాము కోరారు. సునిపెంటలో జునియర్‌ కాలేజీ, తహశీల్దార్‌ కార్యాలయం లైన్‌, శ్రీశైలంలో కొత్తపేట కాలనీ, రెడ్ల సత్రం లైన్‌, యదవ సత్రం లైన్‌, వడ్డెరకాలనీలలో ఓటర్లను వారు కలిసి ప్రచారం నిర్వహించారు. పాములపాడు : ఎస్సీ ఎస్టీ బీసీ, 198 ప్రజా సంఘాలు బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సామన్న, రైతు సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బాలయ్య, నాయకులు మధు ఎమ్మెల్సీ ఓటర్లను కోరారు. మండలంలోని జూటూరు, కోల్స్‌ ఆనందపురం, కంబాలపల్లె, ఇస్కాల గ్రామాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బనగానపల్లె : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంఘం జిల్లా నాయకులు పాండురంగ యాదవ్‌, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు శివయ్య సిఐటియు డివిజన్‌ కార్యదర్శి జీవీ సుబ్బయ్యలు కోరారు. మండలంలోని ఎర్రగుడి, హుస్సేనాపురం, యనకండ్ల, బత్తులూరుపాడు గ్రామాలలో ప్రజానాట్యమండలి, సిఐటియు, బిసి సంఘం, యాదవ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పోతుల నాగరాజును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్‌ మద్దయ్య యాదవ్‌, మండల అధ్యక్షులు ఎర్రగుడి గణ మద్దిలేటి యాదవ్‌, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, అరసం నాయకులు నాగయ్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్‌ పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ పట్టణంలోని ఇందిరా నగర్‌ లో, గవర్నమెంట్‌ హాస్పిటల్‌, కోర్టులలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని కురుకుంద గ్రామంలో ఏపీ రైతు సంఘం కార్యదర్శి మహబూబ్‌ బాషా ప్రచారాన్ని నిర్వహించారు. డివైఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు ఏ.రణధీర్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి డి.రామ్‌ నాయక్‌, పట్టణ పౌర సమాఖ్య నాయకులు ఏ.సురేంద్ర, కెవిపిఎస్‌ నాయకులు భాస్కర్‌ పాల్గొన్నారు. వెలుగోడు : పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ పోతుల నాగరాజును గెలిపించాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామదాసు, సిఐటియు మండల అధ్యక్షులు వాదం నాగమోహన్‌, బీసీ రాష్ట్ర సంఘం నాయకులు రఘు రాముడు, రైతు సంఘం జిల్లా నాయకులు యాదాటి నాగేంద్రుడు మండలంలోని ఇందిరానగర్‌, గాంధీనగర్‌, గుంతకందాల గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాయకులు ఖాదర్‌ వలీ, మోదిన్‌ భాష, రహంతుల్లా, కరిముల్లా, శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్యాపిలి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు డాక్టర్‌ పోతుల నాగరాజును, కత్తి నరసింహారెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిఐటియు జిల్లా నాయకులు టి.శివరాం, ప్యాపిలి మండల కార్యదర్శి ఎస్‌.ఏ.చిన్న రహిమాన్‌, రామాంజినేయులు, నాగమద్దయ్య ఓటర్లను కోరారు. మండలంలోని జలదుర్గం, రామకృష్ణాపురం, మాధవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. చంద్ర, బాలకృష్ణ, అనిల్‌ కుమార్‌, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.