Feb 02,2023 00:12

పాఠశాలలో భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంపిపి కారం లక్ష్మి తదితరులు

పాఠశాలను సందర్శించిన ఎంపిపి కారం లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్‌.పురం

ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఎంపిపి కారం లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు డిమాండ్‌ చేశారు. మండలంలోని ముద్దులగూడెం, సీతంపేట, శ్రీరామగిరి, చొక్కానపల్లి, చొక్కన పల్లి గోమ్ము పాఠశాలలను బుధవారం వారు సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా ఎంపీపీ కారం లక్ష్మి అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఆరా తీశారు. శ్రీరామగిరి మండల పరిషత్‌ పాఠశాలలో ఒకటి నుంచి 8 వరకు తరగతి వరకు 70 మంది పిల్లలు ఉండగా, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, చొక్కాపల్లి స్కూల్లో 30 మందికి ఒక ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, మౌలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సత్యనారాయణ, గొంది ధారయ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.