May 24,2023 00:40

ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరం ముగింపు తేదీ నాటికి ఒక నిర్ధిష్ట పాఠశాలలో 5 విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, ఒక నిర్ధిష్ట పాఠశాలలో 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు మే 24 నుండి 26వ తేదీలోగా బదిలీల కోసం తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ విషయంలో ఉప విద్యాశాఖ అధికారులు, ఎంఇఒలు, హెచ్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అప్లికేషన్లను సంబంధిత డిడిఒలకు అందించాలని, డిడిఒలు, డిప్యూటీ డిఇఒలు, డిఇఒ కార్యాలయంపైన ఆర్జేడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఈనెల 27వ తేదీలోగా అందించాల్సి ఉంటుందని తెలిపారు.