
- మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద విఒఎల ధర్నా
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా): విఒఎల ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాలపరిమితి సర్య్కులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విఒఎల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద వివోఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి.ధనశ్రీ మాట్లాడుతూ వివోఎల ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాల పరిమితి సర్య్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సమాఖ్య లో మెర్జ్ చేయటం వలన వేలాదిమంది వివోఏలకు ఉపాధి పోతుందన్నారు. ఇది మానవ వనరులకు విగాథమని వివోఏ ల ఉపాధికి నష్టం లేకుండా వివోఎల మెర్జ్ ఎక్కువ సంఘాలు ఉన్న వివో ల నుండి తక్కువ సంఘాలు ఉన్న వివో లకు సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి రాజకీయ జోక్యము ఉండకూడదన్నారు. ఉపాధి కోల్పోయిన వారందరికీ నష్టపరిహారం చెల్లించాలన్నారు. వయసు పైబడిన వారికి అనారోగ్యంతో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి వివోఏ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అనేకమంది వివోఏలు మరణించడం, ఆత్మహత్య చేసుకోవటం జరిగిందని దీనికి కారణం ప్రభుత్వ అధికారులు ఒత్తిడిలు,రాజకీయ వేధింపులే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి హెల్పర్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.రమాదేవి మాట్లాడుతూ వివోఏల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కొరకు చేసే ఉద్యమాలకు అంగన్వాడి హెల్పర్ అండ్ వర్కర్స్ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే గోపాల్‌రావు, మచిలీపట్నం సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ జయరావు, ఎండి యూనస్ తదితరులు పాల్గొన్నారు.