Jun 17,2023 00:31

మాట్లాడుతున్న సత్యనారాయణ

పజాశక్తి -నక్కపల్లి:మండుటెండలో కష్టపడి పని చేస్తున్న ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. మండలంలోని ఉపమాక పంచాయతీ శివారు కొర్రవానిపాలెం గ్రామంలో ఉపాధి కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వ్యవసాయ పనులు లేని ఇటువంటి సమయంలో వ్యవసాయ కూలీలను ఆదుకుంటున్న ఈ చట్టానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపులు పెంచాలని, ప్రస్తుతం జాబ్‌ కార్డుకు కేవలం 100 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని తెలిపారు. సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు రూ. 600 కూలీ చెల్లించాలని కోరారు. వేసవి అలవెన్సులు, పనిముట్లకు అదనంగా గతంలో ఇచ్చిన విధంగా డబ్బులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.నానాజీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం:మండలంలో శుక్రవారం భీమవరం, కొరుపోలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, బడ్జెట్లో పూర్తిగా నిదులు తగ్గించ డంతో తక్కువ కూలి చెల్లిస్తున్నారన్నారు.సమ్మర్‌ ఎలవెన్స్‌, మంచి నీరు, తట్ట, గునపాం, పారలకు డబ్బులు ఇవ్వాలన్నారు. మెడికల్‌ కిట్లు, టెంట్లు అందుబాటులో ఉంచాలన్నారు.