జిల్లాలో ఉపాధి' కూలీలకు భరోసా కల్పిస్తాం. 2024 మార్చి నాటికి నిర్దేశిత లక్ష్యమైన రూ.340 కోట్ల మేర పనులు చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేశాం. 45 లక్షల పనులు చేపట్టడంలో భాగంగా ప్రస్తుతం 93 వేల మందికి పైగా కూలీలు హాజరవుతున్నారు. రాబోయే రెండు, మూడు వారాల్లో 1.35 లక్షల మంది హాజరయ్యే అవ కాశం ఉంది. 2024 మార్చి నాటికి 75 లక్షల పని దినాల కల్పన దిశగా పరుగులు పెడుతున్నాం. వేసవి పరిస్థితుల నేపథ్యంలో ఏప్రి ల్, మే మాసాల్లో ఉపాధి పనులకు కూలీలు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ఉపాధి హామీ పను ల కల్పన, ఉపాధి కూలీల ఆరోగ్య భద్రతకు అవసరమైన రీతిలో సన్నద్ధమయ్యామని పేర్కొంటున్న డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ పి.యధు భూషణ్‌రెడ్డితో ప్రజాశక్తి ముఖాముఖి...
జాబ్‌కార్డుదారులు వివరాలు తెలపండి?
జిల్లాలో 5,60,000 మంది జాబ్‌కార్డు కలిగి ఉన్నారు. ఇందులో 4,60,000 మంది పనులకు హాజరవుతున్నారు. వీరిలో 3,50,000 వేలమంది చురుకుగా పనుల్లో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు.
ఉపాధి బడ్జెట్ గురించి తెలపండి?
2023-24లో రూ.340 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్ట డమైంది. ఇందులో ఈఏడాది ఏప్రిల్ నాటికి రూ.204 కోట్ల ఉపాధి కూలి చెల్లిం పులకు, రూ.135 కోట్లు మెటీరియల్ కాంపౌండ్ కింద ఖర్చు చేయాల్సి ఉంది. ఈలెక్కన 340 కోట్లతో కూడిన పనుల్ని జూన్ నాటికి అధిగమిస్తాం. మిగిలిన తొమ్మిది నెలలకు సరి పడా పనులతో కూడిన ప్రణాళికను సిద్ధం చేశాం.
2024 నాటికి పని దినాల కల్పన ఎంత?
2024 చివరి నాటికి 75 లక్షల పని దినాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. గతేడాది 69 లక్షల పని దినా లను కల్పించడమైంది. 2024 ఆర్థిక సంవత్సర జూన్ నాటికి 45 లక్షల పనిదినాలు కల్పించడమే లక్ష్యం. జులై నుంచి మిగిలిన 30 లక్షల పని దినాలకు పనులు కల్పిస్తాం. ఈమేరకు మండ లాల వారీ గా ప్రణాళికను సిద్ధం చేశాం. ఏప్రిల్ మా సంలో 11 లక్షల పని దినాలను కల్పించడమైంది.
ఉపాధి కూలీల చెల్లింపుల వివరాలు తెలపండి?
ఉపాధి కూలీలకు రోజుకు రూ.236 చొప్పున చెల్లింపులు చేస్తాం. నేటి నుంచి రూ.270 పెంచడంపై దృష్టి సారించాం. ఇందుకు సంబంధించి కూలీలు రోజుకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కడప జిల్లాలో 100 శాతం చెల్లింపులు చేస్తున్నాం.
ఆధార్ అనుసంధానం ఎంతవరకు వచ్చింది?
జిల్లాలోని ఉపాధి కూలీ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 95 శాతం మంది ఉపాధి కూలీల ఖాతాలకు ఆధార్ అనుసందానం చేశాం. మిగిలిన ఐదు శాతం మంది ఖాతాలకు ఆధార్ అనుసం ధానం చేయడం జరుగుతోంది. దీంతో ఎన్‌ఎంఎస్ యాప్ ద్వారా ఉపాది కూలీల ఖాతాల్లో నేరుగా కూలీల డబ్బు జమ చేయడం జరుగుతుంది.
ఉపాధి హామీ పనుల వివరాలు తెలపండి?
ఉపాధి హామీ కింద నాలుగు రకాల పనులకు ప్రాధాన్యత ఇవ్వడమైంది. ఇందులో ప్రధానంగా నీటి కుంటలు, నీటి వనరుల నిల్వ, భూసార పరిరక్షణకు సంబంధించిన మృత్తుకా క్రమక్షయ ఆధారిత పనులు, సాగునీటి కాల్వల పనులు చేపట్టడంపై దృష్టి సారించాం.
అమృత్ పథకం ప్రోగ్రెస్ ఎలా ఉంది?
జిల్లాలో 80 చెరువుల్లో ఆధునీకరణ పనులు చేపట్టాం. గతే డాది జులై 30 నాటికి 68 చెరువుల ఆధునీకరణ పనులను పూర్తి చేయడమైంది. మిగిలిన 13 చెరువులతోపాటు సుమారు 100 అమృ త్‌సర్ చెరువులను బలోపేతం చేయడం జరుగుతుంది.










