13న మండల సభలో అభ్యంతరాలు వెల్లడి
ప్రజాశక్తి - ముసునూరు
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం పనులపై గ్రామసభ నిర్వహించిన్నట్లు ఎపిఒ టి.రోజ్‌లీలా తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ముసునూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రిసోర్స్‌పర్సన్ రవిబాబు మాట్లాడుతూ 2022-23వ సంవత్సరం ఉపాధి హామీ చట్టంలో 56 రకాలు పనులపై గతవారం రోజుల నుంచి ఇంటింటికీ వెళ్లీ పనులపై ఎంక్వరీ చేయగా, కొందురు మాత్రమే కలవడం జరిగిందన్నారు. మరికొందరు ఇండ్ల వద్ద లేకపోవడంతో వారు ఏవైనా అభ్యంతరాలు వున్నట్లయితే ఈనెల13వ తేదిన జరిగే మండలసభలో తమ సమస్యలు తెలియజేయాలన్నారు. రాష్ట్ర రిసోర్స్‌పర్సన్ రామచంద్రరావు మాట్లాడుతూ ఉపాధి పనులు నాణ్యతతో కూడిన పనులు చేయించాలని, కొందరు వారం రోజులు పాటు పనిచేసి సంతకాలు పెట్టడం మర్చిపోతున్నారన్నారు. ముసునూరు పంచాయతీ పరిధిలో 56 రకాల పనిదినాలకు పని ప్రదేశంలో నేమ్ బోర్డులు పెట్టాలని వుండగా, అప్పటి ఎపిఒ జె.జయప్రసాద్ పెట్టకపోవడంతో అతని వద్ద నుంచి రూ.13,300లు రికవరీ చేయించిన్నట్లు తెలిపారు. ప్రభుత్వం సగటున పనికి రోజువారి వేతనం రూ.257లు వుండగా, రూ.167లు మాత్రమే వుండటం గమనార్హం. గ్రామసభలో ఉపాధిహామీ పనులు చేయించే మెట్లు రాకపోవడం వల్ల వేసవిలో పని ప్రదేశంలో కూలీలకు మంచినీళ్లు ఏర్పాట్లు, టెంట్ ఏర్పాట్లు మొదలైనవి లేక ఎండ వేడిమికి తట్టుకోలేక కూలీలు పడుతున్న సమస్యలు పైస్థాయి అధికారులకు తెలిసే పరిస్ధితి వుండేదని గ్రామస్థులు అనుకుంటున్నారు.










