Aug 22,2023 21:48

ఫొటో : మాట్లాడుతున్న ఆత్మకూరు క్లస్టర్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శంకర్‌ నారాయణ

'ఉపాధి' సామాజిక తనిఖీపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహించడానికి, ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మకూరు క్లస్టర్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శంకర్‌ నారాయణ పాల్గొని మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి రికార్డులను కార్యాలయంలో అందజేశారన్నారు.
ఈ సామాజిక తనిఖీలో ప్రతి గ్రామపంచాయతీలో మూడు రోజులపాటు పిఆర్‌ఇజిఎస్‌, నాడు-నేడు, ఇరిగేషన్‌ శాఖలో జరిగిన ఉపాధిహామీ పథకం పనులపై సామాజిక తనిఖీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ మస్తాన్‌ ఖాన్‌, సామాజిక తనిఖీ ఎస్‌ఆర్‌పి గోవర్ధన్‌, ఎపిఒ, టెక్నికల్‌ అసిస్టెంట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.