Mar 30,2023 00:10

మాట్లాడుతున్న పీడీ శంకర్‌ నాయక్‌

ప్రజాశక్తి-వేటపాలెం : ఉపాధి హామీ కూలీలు పనిచేస్తేనే జీతాలు వస్తాయని, ఆవిషయాన్ని గుర్తించి పని చేయాలని డ్వామా పీడీ వై.శంకర్‌ నాయక్‌ సిబ్బందిని హెచ్చరించారు. గత ఏడాది కాలంగా మండలలో చేపట్టిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ప్రతి కూలీకి ఖచ్చితంగా వంద రోజులు పని కల్పించాల న్నారు.రానున్న ఆర్ధిక సంవత్సరం నుంచి కూలీలకు వేతనం రూ.272కి ప్రభుత్వం పెంచిందన్నారు. రానున్న నాలుగు నెలలు పనులు కీలకంగా ఉంటాయని చెప్పారు. ప్రజలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా స్థానికం పనులు కల్పించాలని ఆయన తెలిపారు. గత ఏడాది కాలంగా మండలంలో మొత్తం రూ.7.76 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సిబ్బంది వేతనాలకు 3.68 కోట్లు, మెటిరియల్‌కు 4.82 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు. అక్కాయపాలెం గ్రామంలో రూ.1,06,55,219, బచ్చుల వారిపాలెంలో రూ.80, 31,126, చల్లారెడ్డి పాలెంలో 1,06, 18,418, దేశాయిపేటలో 1,42,06,391, కొత్తపేటలో రూ. 1,02,16,403, పందిళ్ళ పల్లిలో రూ.57, 64,101, పాపాయిb ాలెంలో రూ.1,13,14, 733 రామన్నపేటలో రూ. 24, 53, 810, వేటపాలెంలో రూ.44, 08,797 విలువైన పనులు చేసినట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌జిఎస్‌ ద్వారా 600 పనులు, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 130, ఆర్‌డబ్ల్యుఎస్‌ ద్వారా ఒకటి, సోషల్‌ ఫారెస్ట్‌ ద్వారా12 పనులు చేపట్టినట్లు పీడీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్‌ అధికారి శోభన్‌,ఎస్‌ఆర్‌పి ఎపిఎస్‌ఎస్‌ ఎఎటి ఆర్‌డి కె.చంద్రమోహన్‌, ఎంపిడిఒ శర్మ, సర్పంచి కె.రమణ,ఎపిఒ వి.సుధారాణి పాల్గొన్నారు.