'ఉపాధి' పనులపై సామాజిక తనిఖీ
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 17వ విడత సామాజిక తనిఖీ ఉపాధి హామీ పనులపై, ఇతర శాఖల అనుసంధానం ద్వారా పనులు తనిఖీలను సోషల్ ఆడిట్ బృందం 15 రోజుల నుండి పరిశీలన చేసి గ్రామపంచాయతీ స్థాయిలో గ్రామసభలు అనంతరం మండల స్థాయిలో సామాజిక తనిఖీ కార్యక్రమం చేపట్టామని ఎపిడి తెలియజేశారు. ఉపాధి హామీ పనుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు పనులు, జాబ్ కార్డులు, వేతనం అందిస్తున్నారా లేదా దీని ప్రధాన ఉద్దేశమన్నారు. మండలంలో 365 పనులు జరగగా రూ.8కోట్ల 14లక్షల 93వేలు జరిగాయని తెలిపారు. మెటీరియల్ కింద రూ.2కోట్ల 14లక్షల 37వేలు ఖర్చు కాగా మిగతా పనులు చేపట్టామన్నారు. పూర్తిగా ఉపాధి హామీ పనులకురూ రూ.6 కోట్ల 10 లక్షలు ఖర్చు పెట్టామని తెలియజేశారు. పంచాయితీ రాజ్ ద్వారా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్, మిల్క్ సెంటర్లకు ఉపాధి హామీ పనులు అనుసంధానం చేయడం ద్వారా, సిసిరోడ్లు డ్రెయినేజీలకు రూ.1కోటి 99లక్షలు ఖర్చు పెట్టామన్నారు. ఎస్‌ఎస్‌ఎ ద్వారా కాంపౌండ్ వాల్‌కు రూ.4లక్షల 95వేలు అయిందని పేర్కొన్నారు. బహిరంగ సామాజిక తనిఖీలలో రికవరీ కింద చిన్నచిన్న లోపాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించని వారికి రూ.15 వేలు రికవరీ పెట్టామని, అందులో రూ.7185 జమ చేశారన్నారు. సమాచార బోర్డులకు రూ.లక్ష 43వేలతో ఏర్పాటు చేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో అకౌంట్లో డబ్బులు ఉన్నందున తిరిగి ప్రభుత్వానికి జమ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు సురేష్ వెంకటరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ అధికారి వేణుగోపాల్, ఎపిడి శంకరనారాయణ, ఎంపిడిఒ మస్తాన్ ఖాన్, ఎపిఒ సునీల్ కుమార్, ఇసిలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










