May 17,2023 22:11

సామాజిక తనిఖీ సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ వెంకటలక్ష్మి


- ఆర్‌బి పట్నంలో దొంగ మస్తర్లతో రూ 80 వేలు పక్కదారి
- సామాజిక తనిఖీల్లో బయటపడ్డ అవినీతి
ప్రజాశక్తి - పెద్దాపురం
పెద్దాపురం మండలం రాయ భూపాలపట్నంలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం పనుల్లో దొంగ ముస్తర్లు వేసి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రూ.80 వేలు అవకతవకలకు పాల్పడినట్లు ఉపాధి హామీ పథకం మండల సామాజిక తనిఖీలో గుర్తించారు.బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎపిఒ బి.రాజబాబు అధ్యక్షతన జరిగిన సామాజిక తనిఖీ సభలో డ్వామా పిడి అడపా వెంకటలక్ష్మి, జడ్‌పిటిసి గవరసాన సూరిబాబు, ఎంపిపి పెంకే సత్యవతి లు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి మండలంలో రూ.10 కోట్లు విలువ చేసే 1343 ఉపాధి పనులు జరిగా యని ఎపిఒ రాజబాబు తెలిపారు. ఈ పనులపై తనిఖీలు నిర్వహించగా మండల పరిధిలో 23 గ్రామాలుండగా 22 గ్రామాల్లో పనులన్నీ సక్రమంగా జరిగాయన్నారు. రాయ భూపాలపట్నంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ మస్తర్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఫిర్యాదులు అందాయన్నారు. వీటిపై పరిశీలన జరపగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దొంగ మస్తర్లు వేసినట్లు, రూ 80 మేలు అవినీతి పాల్పడినట్టు గుర్తించామన్నారు. డ్వామా పీడీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ పై చర్యలు తీసుకుంటామని, రూ 80 వేలు రికవరీ చేస్తామని ప్రకటించారు. ఈ సభలో ఎండిఒ కరక హిమమహేశ్వరి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.