May 10,2023 23:45

కూలీలతో మాట్లాడుతున్న ఎంపీడీవో


ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని చందనాడ, ఎన్‌ నర్సాపురం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను బుధవారం ఎంపీడీవో సీతారామరాజు పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ఉదయం ఐదు గంటలకే పని ప్రదేశానికి చేరుకుని నిర్ణీత కొలతల మేరకు పనిచేయాలని కూలీలకు సూచించారు. ప్రతిరోజు కనీసం 272 రూపాయలు వేతనం వచ్చే విధంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లో గుర్తించిన పనులను పారదర్శకంగా కూలీలతో పని చేయించాలని ఉపాధి సిబ్బందికి సూచించారు. కూలీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈసీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌, వి ఆర్‌ పి లు పాల్గొన్నారు.