Jun 29,2023 21:23

సమావేశంలో మాట్లాడుతున్న దడాల సుబ్బారావు

-వ్య.కా.స రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు 
బ్రహ్మంగారి మఠం: రాష్ట్రంలో ఉపాధి పనులు కల్పించి, కూలి రేట్లు పెంపుదల కోసం ఉదృత పోరాటాలు చేస్తామని వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు. బ్రహ్మంగారిమఠంలో గురువారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభ మ య్యాయి. ప్రారంభమానికి ముందు ఆయన సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు, ఆంజనేయులు సుందరయ్య చిత్రపటానికి పులమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు దేశంలో ఉపాధి పనులు తగ్గాయని, కేంద్రప్రభుత్వం ఉపాధి పనులకు 25శాతం బడ్జెట్‌లో నిధులు తగ్గించిందని చెప్పారు. పెరుగు తున్న గ్రామీణ పేదల జనాభాకు తగ్గట్లు నిధులు కేటాయిం చడంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్ష పార్టీలు కనీసం స్పందించటం లేదని పార్లమెంట్‌లో కనీసం నోరుమెదపటం లేదని వారు విమర్శించారు. దేశంలో ధరలన్నీ పెరిగిపోయాయని వాటికనుగుణంగా రూ. 600 కూలి పెంచి 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రూరల్‌ ప్రాంతాలు పట్టణాల్లో కలవడంతో మున్సిపాల్టీలుగా మారాయని, తద్వారా గ్రామీణ పేదల సంఖ్య పెరిగిందని చెప్పారు. అందువల్ల పట్టణ, గ్రామీణ పేదలకు ఉపాధి పనులు కల్పించాలని పేర్కొన్నారు. శిక్షణా తరగతుల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లయ్య, సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్షులు. జి.శివకుమార్‌ వి.అన్వేష్‌, అనంతపురం జిల్లా కార్యదర్శి కష్ణమూర్తి, నంద్యాల జిల్లా అధ్యక్షులు సుధాకర్‌. హిందూపురం జిల్లా అధ్యక్షులు, ప్రవీణ్‌, జిల్లా కమిటీ సభ్యులు గోవింద్‌, వీరయ్య, రాయప్పా, కర్నూల్‌, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లా కార్యకర్తలు పాల్గొన్నారు.