ప్రజాశక్తి-ఆదోనిరూరల్
గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని కెవిపిఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప కోరారు. శుక్రవారం మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలుగు వారాలకు పైగా కూలిలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. రోజుకు కూలి రూ.100 నుంచి రూ.150 దాకా పడుతుందని ఉపాధి కూలీలు వాపోతున్నారని చెప్పారు. కొన్నిచోట్ల హాజరు శాతంలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. ఉపాధి కూలీల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీల సమస్యలపైనా, ఉపాధి కూలీలకు కనీస వేతనం పడేవిధంగా చూడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉపాధి కూలీలను సమీకరించి సచివాలయ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న తిక్కప్ప










