
ప్రజాశక్తి-ఎస్.రాయవరం:ఉపాది కూలి బకాయిలు చెలించాలని మండలంలోని వేమగిరి గ్రామంలో ఉపాధి కూలీలు నిరసన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి కూలీలకు ఆరు వారాలుగా బకాయిలు చెల్లించ క పోవడంతో కూలీలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. క్షేత్రస్థాయిలో మేట్లకు స్మార్ట్ ఫోన్లు, పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూలీలకు తట్ట, గునపాం, పారకు డబ్బులు ఇవ్వాలని, సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. ఫే స్లిప్పులు, మెడికల్ కిట్టులు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసారు. ఏ పనులు దొరకని వ్యవసాయ కూలీలు మొదలుకొని డిగ్రీ చదువుకున్న యువతీ యువకుల వరకు ఉపాధి పనులకు వెళుతున్నారని తెలిపారు. ఉపాధి చట్టం పేదలకు వరంలాంటిదని,
ఇటువంటి దీనికి మరింతగా నిధులు పెంచి అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని ఎత్తివేసి కూలీలు పొట్ట కొట్టాలని చూస్తుందన్నారు. పెట్టుబడిదార్లకు లక్షల కోట్లు నబ్సిడీగా ఇస్తున్న ప్రభుత్వం పేదలకు నిధులు తగ్గిస్తుందని తెలిపారు. ఒకే సారి చట్టాన్ని రద్దు చేస్తే కూలీలు తిరగ బడతారనే భయంతో ఈ పథకంలో అనేక షరతులు పెట్టి, ఒక పూటకు బదులు రెండు పూటలు పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. సమ్మర్ అలవన్స్ రద్దు చేశారని, పార, తట్టు, గడ్డపారలకు ఇచ్చే డబ్బులు నిలిపి చేశారని, ఆన్లైన్ మస్టర్లు పెట్టి కూలీలను ఇబ్బంది 'పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి నిధులను సిమెంట్ రోడ్లు,, సచివాలయాల భవనాలకు, మెటీరియల్ చార్జీల పెరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వాడుకుంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిదుల్లో ఎలవెన్స్‌లు కలిపి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వాటిలో నిదులను వాడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండుటెండలో పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని సత్యనారాయణ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.