ప్రజాశక్తి-కొయ్యూరు
నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగంతో కూడిన శిక్షణ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ తెలిపారు. బుధవారం మండలంలోని శరభన్నపాలెంలో ఫౌండేషన్ కార్యాలయంలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుదారుల సర్టిఫికెట్లను పరిశీలించారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలో జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కల్పించడమే ధ్యేయంగా పలు కంపెనీలతో మాట్లాడినట్లు చెప్పారు. ఇందులో భాగంగా పదో తరగతి నుండి డిగ్రీ వరకు చదువుకున్న వారు ఫైర్ సేఫ్టీ, ఇండిస్టియల్ వెల్డింగ్, ఫైర్ సేఫ్టీ ప్లస్, స్కిల్ డెవలప్‌మెంట్, ట్విట్టర్ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించి, శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగం కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పృథ్వీరాజ్, పంచాడ శ్రీరామ్మూర్తి, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఆర్గనైజర్ వంశీ పాల్గొన్నారు.










