Oct 27,2023 23:13

ప్రజాశక్తి- యాదమరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పథకం కింద శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం జరిగిందని, ఉపాధి కల్పనతో పాటు నీటిని సామర్థ్యం పెంచాలని కేంద్ర జలశక్తి అభియాన్‌ కమిటీ బందం నోడల్‌ ఆఫీసర్‌ సచింద్ర కుమార్‌ పట్నాయక్‌ కోరారు. జిల్లాలో శుక్రవారం పలు మండలాల్లో పర్యటించారు. యాదమరి, ఐరాల, పెనుమూరు, కేంద్ర జలశక్తి అభియాన్‌ కమిటీ బందం నోడల్‌ ఆఫీసర్‌ సచీంద్ర కుమార్‌ పట్నాయక్‌, సైంటిస్ట్‌ డాక్టర్‌ సోమరేంద్రో సింగ్‌లు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు తవణంపల్లి, ఐరాల, యాదమరి, పెనుమూరు మండలాల్లో పర్యటించారు. పై మండలాలలో 2022 -23, 2023- 24 సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా యాదమరి మండలం బుడితిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన అమత్‌ సరోవర్‌ చెరువును పరిశీలించారు. అనంతరం కుంటలు, ఫారం ఫౌండ్స్‌, మామిడి, పూలతోటలు, డ్వామా నర్సరీ, ఇంకుడు గుంతలు, జలజీవన్‌ మిషన్‌ వాటర్‌ ట్యాంక్‌, గ్రామా సచివాలయాలు, రైతు భరోసా, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, జగిల్‌ క్లియరెన్స్‌ను పరిశీలించడంతో పాటు వర్క్‌ ఆర్డర్స్‌ యం బుక్స్‌ను పరిశీలించారు. ముందుగా తవణంపల్లి మండలం, తవణంపల్లి పంచాయతీలో మురగేష్‌శెట్టి తనపొలంలో ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేసుకున్న ఫారం ఫౌండ్స్‌, గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను పరిశీలించి, ఫారం ఫౌండ్స్‌ వల్ల ఉపయోగం ఏమిటిని రైతును అడగా వర్షపు నీటిని నింపుకోవడంతో మామిడి చెట్లుకు నీరు సరాఫరా చేసుకోవడం జరుగుతుందని రైతు కమిటీ బందానికి తెలిపారు.
ఐరాల మండలం వడ్రంపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమత్‌ సరోవర్‌ కుంటను 2022 -2023 రూ.4.40 లక్షలు, వడ్రామ్‌పల్లి గ్రామానికి చెందిన రైతు ఎస్‌.వనిజకు చెందిన భూమిలో ఉపాధి హామీ పథకంతో రూ.43వేలతో ఏర్పాటు చేసిన ఫారంఫౌండ్స్‌ను, చినకాంపల్లి పంచాయతీ, చినకాంపల్లి గ్రామానికి చెందిన రైతు యం.శ్రీరాములురెడ్డి మామిడి తోటలో ఉపాధి హామీ పథకంతో రూ.2.53లక్షలతో ఏర్పాటు చేసిన డాగ్‌అవుట్‌ ఫారంఫౌండును, కాణిపాకం గ్రామంలో రూ.71వేలతో డ్వామా నర్సరీని, కామినినాయనపల్లి పంచాయతీ గ్రామంలో రూ.17.74లక్షలతో జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా నిర్మించిన 20వేల లీటర్ల ట్యాంక్‌ను, కామినాయన పల్లి పంచాయతీ, కుళ్ళమపల్లి గ్రామానికి చెందిన బి.కవిత, భూమిలో ఉపాధి హామీ పథకం ద్వారా నాటుకున్నారు. అలాగే 104 మామిడి మొక్కలు, రోజా పూల మొక్కలు, 220 డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను పరిశీలించారు. అలాగే యాదమరి మండలం బుడితిరెడ్డిపల్లి పంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసిన అమృత్‌ సరోవర్‌ కుంటను, 50 రోజులు పని దినాలు కల్పించాలని కమిటీ బదానికి విన్నవించుకున్నారు. అలాగే గంధర్‌నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం, మఠంపల్లి పంచాయతీ, గుత్తావాండ్ల వూరు హరిజనవాడకు చెందిన రైతులు మామిడి తోటలు పెంపకంను, లెక్కల పుదివాండ్ల గ్రామంలో అమత్‌ సరోవర్‌ బసవన్న కుంటను పనులను పరిశీలించారు. కేంద్ర బందం సభ్యుల వెంట డ్వామా పిడి గంగభావాని, ఎంపీడీవో శివరాజ్‌ ఏపీడీలు సునీల్‌కుమార్‌, సుబ్రహ్మణ్యం, ఏపిఓలు సంధ్యారాణి, బాల, లలిత, మీనా కుమారి, టిఏ.మధు, ఐరాల మండల ఎంపిడిఓ నాగరాజు అధికారులు ఉన్నారు.