ఉపాధి కల్పించడంలో మోడీ విఫలం
- ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ
ప్రజాశక్తి - బేతంచెర్ల
దేశ జనాభాలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ నంద్యాల జిల్లా కార్యదర్శి నిరంజన్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ విమర్శించారు. గురువారం నాడు బేతంచెర్ల పట్టణంలో విద్యారంగం-నిరుద్యోగంపై ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు మధు శేఖర్, శివ ఆధ్వర్య ంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ జనాభాలో నిరుద్యోగ యువత 65 శాతం మంది ఉన్నారని వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని వారు అన్నారు. 2014లో ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చి గద్దెనెక్కి ఆచరణలో ఉద్యోగాలు కూడా కల్పించకపోగా కోటి 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే స్థితి తెచ్చారన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీకి కృషి చేయడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని ఎండగట్టాలని, అందుకోసం దేశంలోని విద్యార్థులు, యువకులు ఐక్యం కావాలని పోరాడి రావలసిన ఉద్యోగాలు సాధించుకోవాలని పేర్కొన్నారు.
డోన్ : డోన్ పట్టణంలో విద్యరంగ నిరుద్యోగ సమస్యలపైన అవగాహన సదస్సును డివైఎఫ్‌ఐ డోన్ మండల కార్యదర్శి నక్కిహరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు ఓ.లక్ష్మణ్, ఎం.మధుశేఖర్,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఏ.నిరంజన్,డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.శివ ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి జె.అశోక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఉద్యోగాలు సాధించుకోవాలని, ప్రజలపై మోపుతున్న బారాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు.
మాట్లాడుతున్న విద్యార్థి సంఘాల నాయకులు










