
తెనాలి: నిరుద్యోగం, అరకొర ఉపాది రెండూ దేశానికి ప్రమాదమని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని, ప్రస్తుతం దేశంలో అదే పరిస్థితి నెల కొందని సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబుప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక చెంచుపేట ప్రజాసంఘాల కార్యా లయంలో మంగళవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 'నిరుద్యోగం-దేశంపై దాని ప్రభావం' అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బాబుప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాం తగం ప్రకారం ప్రతి పౌరునికి ఉపాది కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. దేశవ్యాపితంగా గత నెల 30 నుంచి మంగళవారం వరకూ జరిగిన సిపిఎం సమరభేరిలో భాగంగా నిరుద్యోగ తీవ్రతపై సమావేశం నిర్వహించా మన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కిరణ్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 9.82లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, తొమ్మిదేళ్ళ పాలనలో నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఉపాది కల్పించలేకపోయిందన్నారు. ప్రతి ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోదీ విఫలమయ్యా రన్నారు. డివైఎఫ్‌ఐ నాయకులు కె.కృష్ణకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2.36లక్షల ఉద్యోగాలు కాళీగా ఉన్నా, జాబ్ క్యాలం డర్ విడుదల చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదని విమర్శించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి, సిఐటియూ నాయకులు షేక్ హుస్సేన్‌వలి, ఎన్.రాజ్యలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉదరు ఈశ్వర్, కె,సుభాష్, కె.యోగేంద్రరెడ్డి, ఎం.గిరిధర్, వి.విజ్ఞేష్, బి.మల్లిఖార్జున, సిహెచ్ సుహేబ్, ఎం.సంతోష్, ఎస్ సాయిబాలాజి పాల్గొన్నారు.