ప్రజాశక్తి -రావికమతం :ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ పనులను సద్వినియోగం చేసుకోవాలని కవగుంట సర్పంచ్ దాసరి సూర్య కుమారి వరహాలు తెలిపారు. కవగుంట గ్రామంలో ఉపాధి కూలీలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన రోజువారి వేతన కూలి రూ.257 ప్రతి ఒక్కరూ పొందేలా పని చేయాలని సూచించారు. ప్రభుత్వం ఏడాదికి 100 రోజుల పని కల్పిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మట్టి రోడ్లు, పంట కాలువలు, బౌండరీ ట్రెంచెస్, ఫారం పాండ్స్, భూమి చదును, మొక్కల పెంపకం, చెరువుగట్టుపై కొబ్బరి, మామిడి మొక్కల సాగు తదితర అభివృద్ధి పనులు చేసుకోవాలని సూచించారు. మెటీరియల్ నిధుల కింద పంచాయతీకి ప్రత్యేక సొమ్మును ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ఆ సొమ్మును సిసి రోడ్లు, డ్రైన్లు, బిల్డింగ్స్, కల్వర్టులు, చెక్ డ్యాములు, తదితర పనులన్నింటికి ఉపయోగించు కోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మోహన్, పాల్గొన్నారు.










