ప్రజాశక్తి - కాకినాడ
దేశంలో కోట్లాదిమంది కూలీలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అందులో భాగం గానే ఈ సంవత్సరం బడ్జెట్లో 30 వేల కోట్లు తగ్గించిందని దడాల సుబ్బారావు విమర్శించారు. ఈ పథకం వల్ల కూలీలకే కాకుండా రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందని ఉపాధి హామీ డబ్బులతోనే రాష్ట్రంలో సిమెంట్ రోడ్లు, అంగన్ వాడీ భవనాలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి నిర్మిస్తున్నారని, ముఖ్యంగా పేదలు నిర్మించుకుంటున్న గృహ నిర్మాణంలో కూడా ఉపాధి డబ్బులు కేటాయిస్తున్నారని ఇలాంటి గొప్ప పథకాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపక పోవడం చాలా అన్యాయమని విమర్శించారు.శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా కమిటీ సమావేశం కాకినాడ సుంద రయ్య భవన్లో సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత ఇటీవల మరణించిన సంఘం జాతీయ నాయకులు సునీత్ చోప్రా, సంఘం తూర్పు గోదావరి జిల్లా మాజీ నాయకులు పచ్చి మాల వసంతకుమార్‌లకు నివాలులు అర్పించారు. సమావేశంలో కార్యకలాపాల నివేదికన సంఘం జిల్లా కార్య దర్శి కెఎస్.శ్రీనివాస్ ప్రవేశపెట్టగా జిల్లా నాయకులు కూరాకుల సింహాచలం, సిహెచ్ వెంకట లక్ష్ష్మి, డి.అదృష్టదీపుడు, ఆర్. భూలోకం, సి హెచ్.కష్ణ, లాజర్, పొట్లకాయల కృష్ణ, తణుకు రాజు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న దడాల సుబ్బారావు










