May 11,2023 23:40

నినాదాలు చేస్తున్న ఉపాధి హామీ కూలీలు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌ రాము విమర్శించారు. మండలంలోని జగ్గన్నపేట, కాజీపాలెం, పెదపాడు గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశాలను గురువారం ఆయన సందర్శించారు. అక్కడ కూలీలతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు పెంచాల్సింది పోయి ఉన్న సౌకర్యాలు పోగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. గతంలో ఉన్న వేసవి అలవెన్సు 30శాతం, పనిముట్లకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టం రక్షణకై కూలీలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగ్గన్నపేట వైసిపి నాయకులు దొడ్డి కృష్ణ, చక్రవర్తి, కాళ్ల గోవిందరావు, జనపరెడ్డి లక్ష్మి, ద్వారపూడి సత్యవతి, గోవింద తదితరులు పాల్గొన్నారు.