Sep 16,2023 20:43

హామీ పీడీ కు వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

'ఉపాధి హామీ'లో అవినీతి
- రికవరీ చేయడండి : సిపిఎం

ప్రజాశక్తి - ప్యాపిలి

ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మంత్రి అనుచరులు అవినీతికి పాల్పడ్డారని, విచారణ చేసి సొమ్మును రికవరీ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నక్కి శ్రీకాంత్‌, కోయలకొండ నాగరాజు డిమాండ్‌ చేశారు. శనివారం డోన్‌ పట్టణంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (పిడి)కు నక్కి శ్రీకాంత్‌, కోయలకొండ నాగరాజు, రైతు సంఘం మండల అధ్యక్షులు నాగమద్దయ్య, ఐద్వా మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు షమింబేగం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు మహబూబ్‌ బాషా, అశోక్‌,ఐద్వా పట్టణ అధ్యక్షురాలు అమృత పాల్గొన్నారు.