Sep 01,2023 22:23

ప్రజావేదికలో పాల్గొన్న అధికారులు

ప్రజాశక్తి - గాండ్లపెంట : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి హామీ పథకానికి సంబందించిన సామాజిక తనిఖీ ప్రజావేదికను శుక్రవారం నిర్వహించారు. 2022 - 23 సంవత్సరంలో జరిగిన ఉపాధి పనులు పై 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో సేకరించిన నివేదిక ప్రకారం రెండు లక్షల నలభైఏడువేల నాలుగువందల ముఫై రూపాయలు అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. కూలీలకు తక్కువ బిల్లులు పెట్టడం, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కొంతమందికి కూడా బిల్లులు పెట్టినట్లు నిర్ధారించారు. అవినీతి జరిగిన సొమ్మును రికవరీ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో సత్యసాయి జిల్లా అధికారులు పీడీ రామాంజనేయులు, విజిలెన్స్‌ ఆఫీసర్‌ రమణారెడ్డి, విజిలెన్స్‌ అసిస్టెంట్‌ రాజకుమార్‌, ఎపిడి శివశంకర్‌, ఎంపిడిఒ రామానాయక్‌, ఏపీవో మంజునాథ్‌, ఈసీ సుబ్బారెడ్డి, పిఆర్‌ జెఇ రెడ్డి ప్రసాద్‌, ఎంపీపీ జగన్మోహన్‌, వైసీపీ మండల కన్వీనర్‌ పోరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీటీసీ సోమశేఖర్‌ రెడ్డి, సర్పంచులు ఎస్‌ రహమతుల్లా, రవీంద్ర నాయక్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.