May 26,2023 22:59

పిఠాపురం మండలం ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న సింహాచలం

ప్రజాశక్తి - పిఠాపురం
ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఈనెల 30వ తేదీన కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.సింహాచలం పిలుపునిచ్చారు, శుక్రవారం మండలంలోని విరవాడ , విరవ, మంగితుర్తి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను ఆయన కలిసి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుంద న్నారు. అందులో భాగంగా మేట్ల వ్యవస్థను రద్దు చేయడం,ఉపాధి హామీ నిధులు గత కేంద్ర బడ్జెట్లో 90వేల కోట్ల కేటాయిస్తే ఈ సంవత్సరం బడ్జెట్‌ 60వేల కోట్లు కేటాయించారని 30 వేలకోట్లు కోత,సమ్మర్‌ అలవెన్స్‌ తీసివేయటం, బయోమెట్రిక్‌ విధానాన్ని ఏర్పాటు చేయడం, పని వేళల్లో మార్పు, టెంట్లు, త్రాగునీరు ఏర్పాటు చేయక పోవడం,కేంద్ర బడ్జెట్లో 1లక్ష 20 వేలకోట్లు కేటాయించాలని, 200 రోజులు పని దినాలు కలిపించి రూ600 వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లు ఉన్నా యన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పరీక్షించుకోవడానికి అందరూ తరలిరావాలని కోరారు. ఎపివ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మేడపాటి చంటి బాబు, రాగం సత్తిరాజు, టపా నాగేశ్వరరావు, టి.అబ్బాయి, బి. నూకరాజు, డెక్కల లాజర్‌ పాల్గొన్నారు.