Jul 01,2023 22:07

ఫొటో : ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న ఉదయగిరి ఎపిడి గాయత్రీ దేవి

ఉపాధి హామీ పనులు పరిశీలన
ప్రజాశక్తి-జలదంకి : మండలంలోని జలదంకి, బ్రాహ్మణక్రాక గ్రామాల పరిధిలో జరుగుతున్న పనులను శనివారం ఉదయగిరి ఎపిడి గాయత్రీ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాబు కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. వేసవికాలం దృష్ట్యా ఉదయం 6 గంటలకు పని మొదలుపెట్టి 10 గంటల లోపు ఇచ్చిన కొలతల ప్రకారం పని పూర్తి చేయాలని కూలీలకు సూచించారు. ప్రతిరోజు రూ.272 వచ్చే విధంగా పని కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.
కార్యక్రమంలో క్లస్టర్‌ టిఎ ఉదయగిరి పి.చెన్నయ్య, బిఎఫ్‌టి రంగారెడ్డి, ఇసి (ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌) ఎన్‌.శ్రీనివాసులు, టిఎ (టెక్నికల్‌ అసిస్టెంట్‌) చిరంజీవి, ఫీల్డ్‌ అసిస్టెంట్లు జి.జనార్ధన్‌, పి.వేణు, వి.ప్రసన్న, వై.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.