May 02,2023 00:54
ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్న సర్పంచ్‌ రవికిరణ్మయి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఈ ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు కల్పించాల్సిన పనులను సోమవారం గ్రామ సర్పంచ్‌ దారా రవికిరణ్మయి ప్రారంభిం చారు. ఇప్పటి వరకు వ్యవసాయ పనులలో నిమగమైన కూలీలకు వ్యవసాయ పనులు మందగించటంతో ఉపాధి కోసం ప్రభుత్వం కల్పించిన ఈ పనులను నిబంధనల ప్రకా రం పూర్తి చేసి నిర్దేశించిన వేతనం పొందాలని సర్పంచ్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో టిఏ పి సుధీర్‌, జెఈ జయ చంద్ర, నాయకులు చెన్నయ్య, ఫీల్డ్‌అసిస్టెంట్‌లు ఉన్నారు.