ప్రజాశక్తి-అనకాపల్లి
మండలంలోని సత్యనారాయణపురం పంచాయతీ మూలపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం మండల పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు పరిశీలించారు. హాజరు పట్టికను తనిఖీ చేసి అందులో పలు తప్పులు ఉండడంతో వీఆర్పీ నాగమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులకు హాజరు కాని వారికి కూడా హాజరు వేయడంతో అవకతవకలు జరిగినట్టు భావించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ధర్మారావుకు సూచించారు. కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చిన కొలతల ప్రకారం పని చేస్తే ప్రతిరోజు 257 రూపాయలు కూలి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధర్మారావు, ఎంపీటీసీ సభ్యురాలు కర్రి మజ్జి అలివేణి, సర్పంచ్ పలక భాగ్యలక్ష్మి సత్తిబాబు, వైస్ సర్పంచ్ పి భవాని, చవ్వాకుల ఈశ్వరరావు, ఎం సతీష్, వైసిపి నాయకులు పెద్దాడ రామశంకర్, గ్రామ కార్యదర్శి శ్రావణి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










