Oct 21,2023 16:28

ప్రజాశక్తి - ఉంగుటూరు
   గోపీనాథపట్నం సచివాలయం వద్ద శనివారం ఉపాధి హామీ పనుల గుర్తింపుపై ప్రాథమిక గ్రామసభ సర్పంచి పుత్సకాయల విష్ణుమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో ఉపాధి పనులు చేపట్టేందుకు అవసరమైన పనులను గుర్తించి సభ దృష్టికి తేవాలని సర్పంచి కోరారు. ముఖ్యంగా రైతులు, ప్రజలు గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు పంచాయతీ దృష్టికి తీసుకువస్తే, వాటిని ఈనెల 25న గ్రామంలో ఆమోదించి, అనుమతుల మంజూరు కోసం ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. 33 పనులను ప్రాథమికంగా గుర్తించారన్నారు. ఈ గ్రామసభలో సచివాలయం కన్వీనర్‌ గంటా లక్ష్మణరావు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సచివాలయం కార్యదర్శి బ్రహ్మానందం, ఎన్‌ఆర్‌జిఎస్‌ సాంకేతిక నిపుణుడు, ఫీల్డ్‌ అసిస్టెంటు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.