
ప్రజాశక్తి-పరవాడ
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసే చర్యలు ఆపాలని, పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మండలంంలోని వెన్నలపాలెంలో గురువారం సిఐటియు ఆధ్వర్యాన కూలీలు నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం బడ్జెట్లో సంవత్సరానికి రూ.2.40 లక్షల కోట్లు కేటాయించాలని, సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. రోజుకి రూ.600 రూపాయలు కూలి, సమ్మర్ అలవెన్స్, గుణపాం, పార, తట్టకి, మంచినీటికి పాత పద్ధతుల్లో డబ్బులు చెల్లించాలని, మస్టర్ విధానం పాత పద్ధతుల్లో కొనసాగించాలని, ప్లే షిప్పులు ఇవ్వాలని కోరారు. పని ప్రదేశంలో టెంట్లు మంచినీళ్లు సౌకర్యం, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.