Apr 11,2023 00:34

నినాదాలు చేస్తున్న కూలీలు

ప్రజాశక్తి-ఎస్‌:రాయవరం:సమస్యలను పరిష్కరించాలని మండలంలో పెట్టుగొల్లపల్లి గ్రామంలో సోమవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ మాట్లాడుతూ, రోజు వారీ కూలి రూ.600 ఇచ్చి 200 రోజుల పని దినములు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నీడ, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు.