ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని కాగిత గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ సందీప్ బుధవారం పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనులు, చెరువుగట్టు పై మొక్కల పెంపకం వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అమృత సరోవర్ పథకం కింద 122 చెరువులకు గాను 65 పూర్తి చేసామన్నారు. కొత్తగా మరిన్ని చెరువులను తవ్విస్తున్నామని, ఒక్కో దానికి రూ.20 నుంచి 24 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. చెరువుల ద్వారా భూగర్భ జలాలను పెంచడంతో పాటు మూగజీవాలకు నీటిని అందించడం లక్ష్యమన్నారు. ఈ ఏడాదిలో కోటీ పని దినాలుగాను 88 లక్షలు పూర్తి అయ్యాయని, ఇందుకోసం సుమారుగా 173 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రానున్న సంవత్సరానికి కోటి యాభై లక్షల పని దినాలు చేయాలనేది లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, ఉపాధి ఏపీడి శ్రీను, ఏపీఓ ఈశ్వరరావు పాల్గొన్నారు.










