
మాట్లాడుతున్న చిరంజీవి
ప్రజాశక్తి-రోలుగుంట:ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేత ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం రోలుగుంట మండలంలో ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకునన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఉపాధి కూలీలకు బడ్జెట్‌లో నిధులు తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో రెండు లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు 16 వేల కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. ఉపాధి కూలీలకు నిధులు బడ్జెట్‌లో పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మజ్జిగ, మెడికల్ కిట్లు, టెంట్ సౌకర్యాలు కల్పించాలని, 200 రోజులు పని దినాలు ఇవ్వాలని, 600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.