
మాట్లాడుతున్న కెవిపిఎస్, వ్యకాస నేతలు
ప్రజాశక్తి-రోలుగుంట: మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, ఉపాధి పథకానికి బడ్జెట్లో నిధులు పెంచాలని, ప్రతి కుటుంబానికి 200రోజులు పని దినాలు కల్పించాలన్నారు. రోజుకి రూ.500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రూపుకి టెంట్ హౌస్, మెడికల్ కిట్టు, మజ్జిగ ఇవ్వాలన్నారు. 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇచ్చి, ప్రతి సభ్యుడికి పేస్లిప్ ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు బాలరాజు పాల్గొన్నారు