May 23,2023 20:05

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మధుసూదన్‌

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఫెయిత్‌ హోంలో డాక్టర్‌ పి.డానియల్‌ ప్రేమ్‌ కుమార్‌ అధ్యక్షతన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై మంగళవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ యువత జీవితంలో త్వరగా స్థిరపడేందుకు శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఆలూరు ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.సుధాకర్‌, వృత్తి విద్య నిపుణులు సుమంత్‌, నోబుల్‌ ఒకేషనల్‌ కళాశాల కరస్పాండెంట్‌ దేవదానం, కర్నూలు డేప్ప్రింగ్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు సుశాంత్‌, ఆసిఫ్‌ ఖాన్‌ పాల్గొని వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. సలోమి, మనోజ్‌, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.