Oct 21,2022 23:54

ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఐటిడిఎ పిఒ

ప్రజాశక్తి-మారేడుమిల్లి
రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకొని యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. స్థానిక వైటీసీ కార్యాలయంలో శుక్రవారం మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ జాబ్‌ మేళాను ఐటీడీఏ పీవో సూరజ్‌ గానోరే, సబ్‌ కలెక్టర్‌ శుభంతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ జుట్‌ మెళాలో నవతా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌, గ్రీన్‌ బేక్‌ ఇండిస్టీస్‌, అమరాన్‌ రాజు ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఆపోలో ఫార్మసీ, మదర్‌ అండ్‌ ఫాదర్‌ నర్సింగ్‌ సర్వీస్‌, వరుణ్‌ మోటార్సు, మోహన్‌ స్పీన్‌ టేక్స్‌ ఇండియా, శుభ గృహ ప్రాజెక్ట్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఆస్ట్రోజెన్‌ స్థిర్‌, కిక్సన్‌ ఇండియా, బ్లూస్టార్‌, మార్లు సెంట్రల్‌ ఫార్మసీ, రిలయన్స్‌ జిమో తదితర 15 సంస్థలు పాల్గొన్నాయి. 543 అభ్యర్థులు హాజరు కాగా, 155 ఎంపికయ్యారు. అనంతరం సెలక్ట్‌ అయిన అభ్యర్ధులకు నియామక పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. ఈ కార్యకరమంలో ఎంపీడీవో వీరకిషోర్‌, జెడ్‌పిటీసీ సభ్యుడు గొర్రె బాలాజీ బాబు, వైస్‌ ఎంపీపీ లక్కోండ రవికుమార్‌, సర్పంచ్‌ కొండా జాకబ్‌, మాజీ జెట్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గొర్రె బాబీ, తదితరులు పాల్గొన్నారు.