మజ్జిగ పంపిణీ చేస్తున్న సర్పంచి కృష్ణమోహన్
ప్రజాశక్తి- కొల్లూరు : మండల పరిధిలోని తోకలవారిపాలెం,తురకపాలెం గ్రామాల్లో ఉపాధి చట్టం పనులను తోకలవాని పాలెం గ్రామ సర్పంచి టి.కష్ణమోహన్ బుధవారం ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించి కూలీలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. రెండు పూటల పనివిధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలిపారు. దీంతో కూలీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. రెండు పూటల పనివిధానాన్ని రద్దు చేయాలని కోరారు.










