Mar 04,2023 00:23

పరిశీలిస్తున్న డిటిఒ సుభాషిని

ప్రజాశక్తి -కోటవురట్ల:ఉపఖజానా కార్యాలయాన్ని జిల్లా ఖజానా అధికారి సుభాషిని శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులు సమస్యలను ఆమెకు విన్నవించారు. అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది ఉప ఖజాన కార్యాలయాలు ఉండగా కోటవురట్ల, అనకాపల్లి నియోజకవర్గంలో మరో ఖజానా కార్యాలయాలు అద్దెకు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 8500 మంది విశ్రాంత ఉద్యోగులకు సేవలందిస్తున్నామన్నారు. కోటవురట్ల కార్యాలయంలో నాతవరం, మాకవరపాలెం మండలాల ఉద్యోగులకు అదే విధంగా ఆయా గ్రామ పంచాయతీలకు సేవలు అందు తున్నాయని సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట ఉప ఖజానా అధికారి నాయుడు పాల్గొన్నారు.