ఆర్‌ఐఒ సత్యనారాయణను సత్కరిస్తున్న రమణాజీ తదితరులు
ఆర్‌ఐఒ సత్యనారాయణ
ప్రజాశక్తి- చోడవరం
జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే చదివే ఆయుధమని, అటువంటి చదువును అశ్రద్ధ చేయవద్దని ఇంటర్మీడియట్ బోర్డు రీజినల్ ఇన్‌స్పెక్టర్ ఆఫీసర్ (ఆర్‌ఐఒ) ఆర్.సత్యనారాయణ అన్నారు. స్థానిక ఉషోదయ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఎంతో నైపుణ్యత గల విద్యార్థులు ఉన్నారని, వాటిని వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం సత్యనారాయణను ఉషోదయ కళాశాల ఛైర్మెన్ జె.రమనాజీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జె.కృష్ణకుమారి, డీన్ ఎస్‌వి.వాసు, ప్రిన్సిపల్ విఎస్‌ఎస్ అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ ఎస్.రఘు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.










