May 09,2023 23:28

టెన్త్‌లోఉత్తమ మార్కులు సాధించిన విద్యార్దిని లక్ష్మీని సత్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా



- టెన్త్‌ ప్రతిభావంతులను సత్కరించిన కలెక్టర్‌
ప్రజాశక్తి - కాకినాడ
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను, పాఠశాల ప్రధానోపాధ్యా యులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులకు కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లా ఆర్‌జెడి జి.నాగమణి, విద్యా శాఖ అధికారులతో కలిసి 600లకు 575 పైబడి మార్కులు సాధించిన 31 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసి, బహుమతుల ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో డా. బీఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలల్లో మొదటి స్థానం సాధించిన కాకినాడ గ్రామీణం, పి.వెంకటాపురం డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ గురుకుల పాఠశాలకు చెందిన దడాల జ్యోత్స్నను గురుకుల పాఠశాల కోఆర్డినేటర్‌ ఎ.మురళీకష్ణను అభినందించారు. కార్యమ్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి కెఎన్‌విఎస్‌ అన్నపూర్ణ, డిప్యూటీ డిఇఒలు డానియల్‌ రాజ్‌, డి.సుభద్ర, వివిధ మండలాల ఎంఇఒలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
చంద్రంపాలెం విద్యార్ధిని తలాటం లక్ష్మికి సత్కారం
సామర్లకోట రూరల్‌ మండలం చంద్రంపాలెం శివారు ఉప్పరిగూడెం జడ్‌పి హైస్కూల్‌ విద్యార్ధిని తలాటం లక్ష్మి 10వ తరగతిలో ఈ ఏడాది 582 ఉత్తమ మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కాకినాడ పిఆర్‌ జి బాలురన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈసందర్భంగా విద్యార్ధిని లక్ష్మిని కలెక్టర్‌ కృతిక శుక్లా, ఆర్‌జెడి నాగమణి, డిఇఒ అన్నపూర్ణలు ఘనంగా సత్కరించి అభినందించి జ్ఞాపికలు అందజేశారు. పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన చోడిశెట్టి వెంకటలక్ష్మి (581), కొరుప్రోలు భువనేశ్వరి (578) మార్కులు సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.