May 14,2023 17:19

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర సహాధ్యక్షులు చంద్రశేఖర్

ఉన్నతి లేని పదోన్నతులు మాకొద్దు - ఎస్టియూ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

        ఉన్నతి లేని పదోన్నతులు మాకొద్దని శాస్త్రియ పద్దతిలో పదోన్నతులు జరగాలని జిల్లా అధ్యక్షులు అజాం బేగ్,రాష్ట్ర సహా అధ్యక్షుడు చంద్రశేఖర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు ఎస్టీయు నంద్యాల జిల్లా కార్యాలయం నందు ముఖ్య నాయకుల సమావేశం జరిగినది .ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అజాం బేగ్,రాష్ట్ర సహా అధ్యక్షుడు చంద్రశేఖర్ లు మాట్లాడుతూ ఆశాస్త్రయ మైన పదోన్నతుల విధానానికి స్వస్తి పలికి గతంలో నిర్వహించిన విధంగా డిపార్ట్మెంట్ ద్వారా పై పోస్టులకు పదోన్నతులు ఇచ్చి వెంటనే వారికి వేతన స్థిరీకరణ చేయాలనీ అలా కాకుండా జనవరిలో నిర్వహించిన అదనపు అలవెన్సులతో 2500 కూడిన ప్రమోషన్లలో  ఉపాధ్యాయులు సుదూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసిన కూడా ఎలాంటి ప్రయోజనం లేక పోవడంతో మరీ 10 ప్లస్ 2 పాఠశాలలకు ఇదే విధానంలో పదోన్నతులు నిర్వకాహించాలని భావిస్తే సంఘటితంగా వాటిని ఎస్టీయు సంఘ పక్షాన  అడ్డొకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దేవేంద్ర రెడ్డి,నాగేశ్వర్ నాయక్, సీనియర్ నాయకులు శేఖర్,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.