May 06,2021 07:17

భారత రాజ్యాంగం ప్రకారం విద్యను ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వాలు తాము నిర్వహించవలసిన కర్తవ్యాలను పక్కనపెట్టి కార్పొరేటు శక్తులకు కొమ్ముకాస్తూ విద్య ద్వారానే అదిక లాబాలు వచ్చే విదంగా నిర్ణయాలు చేస్తున్నాయి. పాలకులు మనకు ప్రపంచ స్థాయి విద్యను నేర్పిస్తామని చెప్తూ విద్య వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి-2020 ను తీసుకువచ్చి విద్యను ప్రైవేటీకరణ దిశగా పరుగులు పెట్టిస్తుంది. ఈ ఎన్‌ఇపి ను ఏ రాష్ట్రప్రభుత్వం అమలు చేయనంతగా మన రాష్ట్ర ప్రభుత్వం జోరుగా అమలు జరిపే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగమే విద్యార్ధులకు ఉపకారవేతనాలు రద్దుచేసి విద్యార్ధులకు ఉన్నత విద్యను దూరం చేయడం.
వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం 2008వ సం.లో ఫీజు రియంబర్స్‌ మెంట్‌ పథకాన్ని తెచ్చింది. అయితే ఈ పథకం వెనుక రాజకీయ లబ్ధి ఉన్నప్పటికీ విద్యార్ధులకు చాలా వరకు మేలు జరిగింది. రాష్ట్రంలో రాజన్న పాలన తిరిగి అందిస్తామని అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తండ్రి ఆశయాలకు తూట్లు పొడుస్తూ జీవో నెం.77ను తీసుకువచ్చి ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న పిజి, వృత్తి విద్యా కేర్సులు, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సులు, ఎమ్‌బిఎ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు ఉపకారవేతనాలు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 పిజి మరియు ప్రభుత్వ యూనివర్శిటీల్లో 1662 సీట్లు మాత్రమే ఉన్నాయి. అలాగే ప్రభుత్వ బీటెక్‌ 23 కళాశాలల్లో 284 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎమ్‌సిఎ, ఎమ్‌బిఎ ఇలా అనేక కోర్సులకు ప్రభుత్వ విద్యాసంస్థలు తక్కువగా ఉన్నాయి. విజయనగరం వంటి జిల్లాల్లో ఇటువంటి కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో చదువుకోవడానికి అసలు అవకాశమే లేనటువంటి పరిస్థితుల్లో విద్యార్ధులు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఏదోరకంగా ప్రభుత్వం నుండి ఉపకారవేతనం వస్తే తక్కువ ఖర్చుతో ఈ ప్రైవేటు కాలేజీల్లోనైనా చదువుకుందామనుకుంటే వాటిని కూడా దూరం చేసి విద్యార్ధులకు ఉన్నత విద్య అందకుండా చేస్తోంది. దీని పర్యవసానంగా విద్యార్ధులు చేరక చాలా ప్రైవేటు పిజి కళాశాలలు మూతబడ్డాయి. ఉన్న కళాశాలల్లో కూడా కనీసం 10% కూడా అడ్మిషన్లు జరగలేదు. మరికొద్ది రోజుల్లో ఇంజనీరింగ్‌ కాలేజీలకు కూడా ఇదే పరిస్థితి దాపురిస్తుంది.
విద్యా దీవెనలతో విద్యార్ధులకు మేలు జరిగేనా :-
ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పథకాలు పేర్లు మారుతున్నాయి. కానీ ఆ పథకాలు ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. గత రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌టిఎఫ్‌, ఎమ్‌టిఎఫ్‌ లను చాలా వరకు పెండింగ్‌లో ఉంచింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆర్‌టిఎఫ్‌, ఎమ్‌టిఎఫ్‌ లు స్థానంలో వసతిదీవెన, విద్యాదీవెన అని తీసుకువచ్చి గతంలో పెండింగ్‌లో ఉన్న ఆర్‌టిఎఫ్‌, ఎమ్‌టిఎఫ్‌ లను విడుదల చేయకుండా విద్యార్ధులను ఇబ్బందుల్లో నెట్టేసింది.
విద్యార్ధులందరికీ విద్యాదీవెన పథకం ద్వారా పూర్తిస్థాయి ఫీజురియంబర్స్‌మెంట్‌ ఇస్తామని నమ్మబలికిన రాష్ట్ర ప్రభుత్వం అది సాధ్యంకాదని తెలిసి చాలా తెలివిగా వ్యవహరించింది. కళాశాలలను న్యాక్‌ గ్రేడింగ్‌, సొంత భవనాలు, ప్రమాణాలు ఆదారంగా మూడు కేటగిరీలు క్రింద విభజించి వాటికి ఫీజులు నిర్ణయించింది. దీనితో రాష్ట్రంలో చాలా కాలేజీలు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించనప్పటికీ మొదటి కేటగిరీ క్రిందకు తెచ్చుకున్నాయి. దీని కారణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే గతంలో తక్కువ ఫీజులున్న కాలేజీలకు ఎక్కువ ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ఫీజలు మూడు కేటగిరీలకు ఒక్కొక్క గ్రూప్‌ కు ఒక్కో విదంగా నిర్ణయించబడ్డాయి. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే రాష్ట్రంలో 80% పైగా ప్రైవేటు కాలేజీలు గవర్నమెంట్‌ నిర్ణయించిన ఫీజులు కంటే అధిక ఫీజలను వసూలు చేస్తున్నాయి. ఎందుకు ఇంత ఎక్కువ ఫీజులు వసూలుచేస్తున్నారని కళాశాల యాజమాన్యాలకు అడిగితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో కాలేజీలు నడపడం కష్టమని అలాగైతే కళాశాలలను మూసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని చెబుతున్నారు. ఉన్నత విద్యలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య గాని అద్యాపకుల సంఖ్య గాని ఇప్పుడు లేదు. ఈ తరుణంలో ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడితే విద్యార్ధులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ విద్యనందించడం సాధ్యం కాని పని.
ఇక నిధులు మంజూరు విషయంకు వస్తే విద్యాదీవెన పథకం తీసుకు విచ్చినప్పటినుండి అర్హుల సంఖ్యను ఎలా తగ్గించాలనే ఆలోచనలు చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జివో నెం.77 ను తీసుకువచ్చి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పిజి, ఎమ్‌బిఎ వంటి కోర్సులు,ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలో కొన్ని కోర్సులకు, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందవనిచెప్పి కొంత మంది అర్హులను తగ్గించింది. ఇక్కడితో ఆగకుండా దీన్ని డిగ్రీ కూడా అమలు జరిపేప్రయత్నం చేసింది. అందులో బాగంగానే ఆన్‌లైన్‌ విదానంలో అడ్మిషన్లు జరిపించింది. మూడు విడతల్లో కూడా సీట్లు రానివారికి, అప్పటికి ఇంకా ఆన్‌లైన్‌ చేయకుండా స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో జాయిన్‌ అయిన వారికి ఎటువంటి ఉపకారవేతనాలు అందవని తేల్చి చెప్పింది. ఈ రకంగా కొంతమంది అర్హులు సంఖ్యను తగ్గించింది. గతంలో రెండు స్టెప్స్‌లో జరిగిన ఆన్‌లైన్‌ విధానాన్ని ఇప్పుడు ఆరు స్టెప్స్‌లో జరిగే విదంగా చేసింది. దీనితో విద్యార్ధులు చదువులు మాని నెట్‌ సెంటర్లు చుట్టూ, కళాశాలల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగవలసి వచ్చింది. రేషన్‌ కార్డు సరిపోదు ఇన్‌కమ్‌ తప్పనిసరి అని ఓటిపిలు రావడంలేదని కారణాలు చూపి మరికొంతమందిని తగ్గించింది. ఖాతాల్లో డబ్బులు జమచేసే విషయానికి వచ్చేసరికి గత టిడిపి ప్రభుత్వం హాయంలో విదేశీ విద్యా కానుక పథకాన్ని తీసుకువచ్చి ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. 2018-19 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరు చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి ప్రభుత్వం మారిన తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వం గొప్పలకు పోయి ఇకనుండి విదేశీ విద్యా కానుక క్రింద 15 లక్షలు రూ. ఇస్తామని ప్రకటించింది. ప్రకటనుల అయితే బాగానే చేసింది కానీ మైనారటీ, ఇబిసి విద్యార్ధులకు ఇప్పటివరకు ఇంకా నిధులు మంజూరు చేయలేదు. ఈ పాస్‌ లో నిధులు మంజూరైనట్లు చూపిస్తున్నప్పటికీ కళాశాలలకు మాత్రం నిధులు చేరలేదు. ఇటువంటి బాదితులు రాష్ట్రంలో సుమారు 560 మంది ఉన్నారు. పిలిప్పిన్స్‌లోని దావో మెడికల్‌ కాలేజీలో అయితే ఫీజు కట్టలేదని 15 మందిని వసతిగృహం నుండి బయటకు పంపించేశారు. ప్రపంచమంతటా కరోనా విళయ తాండవమాడుతున్న తరుణంలో దేశం కాని దేశంలో విద్యార్ధులు ఎటుపోవాలో తెలియక సతమతమౌతున్నారు.
విద్యార్ధులందరికీ విద్యాదీవెన పథకం ద్వారా పూర్తిస్థాయి ఫీజురియంబర్స్‌మెంట్‌ ఇస్తామని నమ్మబలికిన రాష్ట్ర ప్రభుత్వం అది సాధ్యంకాదని తెలిసి చాలా తెలివిగా వ్యవహరించింది. కళాశాలలను నేక్‌గ్రేడింగ్‌, సొంతభవనాలు, ప్రమాణాలు ఆదారంగా మూడు కేటగిరీలు క్రింద విభజించి వాటికి ఫీజులు నిర్ణయించింది. దీనితో రాష్ట్రంలో చాలా కాలేజీలు రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించనప్పటికీ మొదటి కేటగిరీ క్రిందకు తెచ్చుకున్నాయి. దీని కారణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే గతంలో తక్కువ ఫీజులున్న కాలేజీలకు ఎక్కువ ఫీజులు వసూలు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ఫీజలు మూడు కేటగిరీలకు ఒక్కొక్క గ్రూప్‌ కు ఒక్కో విదంగా నిర్ణయించబడ్డాయి. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే రాష్ట్రంలో 80% పైగా ప్రైవేటు కాలేజీలు గవర్నమెంట్‌ నిర్ణయించిన ఫీజులు కంటే అధిక ఫీజలను వసూలు చేస్తున్నాయి. ఎందుకు ఇంత ఎక్కువ ఫీజులు వసూలుచేస్తున్నారని కళాశాల యాజమాన్యాలకు అడిగితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో కాలేజీలు నడపడం కష్టమని అలాగైతే కళాశాలలను మూసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదని చెబుతున్నారు. ఉన్నత విద్యలో ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య గాని అద్యాపకుల సంఖ్య గాని ఇప్పుడు లేదు. ఈ తరుణంలో ప్రైవేటు విద్యాసంస్థలు మూతబడితే విద్యార్ధులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ విద్యనందించడం సాధ్యం కాని పని.
ఇక నిధులు మంజూరు విషయంకు వస్తే విద్యాదీవెన పథకం తీసుకు విచ్చినప్పటినుండి అర్హుల సంఖ్యను ఎలా తగ్గించాలనే ఆలోచనలు చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జివో నెం. 77 ను తీసుకువచ్చి ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న పిజి, ఎమ్‌బిఎ వంటి కోర్సులు,ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీలో కొన్ని కోర్సులకు, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందవనిచెప్పి కొంత మంది అర్హులను తగ్గించింది. ఇక్కడితో ఆగకుండా దీన్ని డిగ్రీ కూడా అమలు జరిపేప్రయత్నం చేసింది. అందులో బాగంగానే ఆన్‌లైన్‌ విదానంలో అడ్మిషన్లు జరిపించింది. మూడు విడతల్లో కూడా సీట్లు రానివారికి, అప్పటికి ఇంకా ఆన్‌లైన్‌ చేయకుండా స్పాట్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో జాయిన్‌ అయిన వారికి ఎటువంటి ఉపకారవేతనాలు అందవని తేల్చి చెప్పింది. ఈ రకంగా కొంతమంది అర్హులు సంఖ్యను తగ్గించింది. గతంలో రెండు స్టెప్స్‌లో జరిగిన ఆన్‌లైన్‌ విధానాన్ని ఇప్పుడు ఆరు స్టెప్స్‌లో జరిగే విదంగా చేసింది. దీనితో విద్యార్ధులు చదువులు మాని నెట్‌ సెంటర్లు చుట్టూ, కళాశాలల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగవలసి వచ్చింది. రేషన్‌ కార్డు సరిపోదు ఇన్‌కమ్‌ తప్పనిసరి అని ఓటిపిలు రావడంలేదని కారణాలు చూపి మరికొంతమందిని తగ్గించింది. ఖాతాల్లో డబ్బులు జమచేసే విషయానికి వచ్చేసరికి గత టిడిపి ప్రభుత్వం హాయంలో విదేశీ విద్యా కానుక పథకాన్ని తీసుకువచ్చి ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. 2018-19 విద్యా సంవత్సరానికి గాను నిధులు మంజూరు చేసింది. 2019-20 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి ప్రభుత్వం మారిన తరువాత వచ్చిన కొత్త ప్రభుత్వం గొప్పలకు పోయి ఇకనుండి విదేశీ విద్యా కానుక క్రింద 15 లక్షలు రూ|| ఇస్తామని ప్రకటించింది. ప్రకటనుల అయితే బాగానే చేసింది కానీ మైనారటీ, ఇబిసి విద్యార్ధులకు ఇప్పటివరకు ఇంకా నిధులు మంజూరు చేయలేదు. ఈ పాస్‌ లో నిధులు మంజూరైనట్లు చూపిస్తున్నప్పటికీ కళాశాలలకు మాత్రం నిధులు చేరలేదు. ఇటువంటి బాదితులు రాష్ట్రంలో సుమారు 560 మంది ఉన్నారు. పిలిప్పిన్స్‌లోని దావో మెడికల్‌ కాలేజీలో అయితే ఫీజు కట్టలేదని 15 మందిని వసతిగృహం నుండి బయటకు పంపించేశారు. ప్రపంచమంతటా కరోనా విళయ తాండవమాడుతున్న తరుణంలో దేశం కాని దేశంలో విద్యార్ధులు ఎటుపోవాలో తెలియక సతమతమౌతున్నారు.
విద్యార్ధుల సంక్షేమానిన పక్కన పెట్టి ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచనలు చేయడం వలన ఇటు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అటు యాజమాన్యాలు మొత్తంగా విద్యా వ్యవస్తే సమూలంగా నాశనమైపోయే పరిస్థితి ఏర్పడనుంది.నాగరికత ద్వారా లభించే ఎటువంటి భౌతిక వస్తువులనైనా వదులుకోవచ్చునేమో కానీ విద్యా ద్వారా లభించే సత్కృష్ట ఫలితాలను, ఫలాలను పొంది హక్కును మాత్రం ఎట్టిపరిస్థితిల్లో వదులుకోకూడదు అని డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ అన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు ఆ విద్యనే లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా విద్యార్ధులందరూ ఏకమై జివో నెం.77 రద్దు చేసి ఎటువంటి షరతులు లేకుండా అంతమంది విద్యార్ధులకు విద్యా, వసతి దీవెనలు అందించేవరకూ ఉవ్వెత్తున ఎగసి ఉద్యమించాలి.

- డి.రాము (ఎస్‌ఎఫ్‌ఐ విజయనగరం)