Jun 21,2023 19:12

సమావేశంలో మాట్లాడుతున్న మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి - ఆదోని
ఉన్నత విద్యా విధానం అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షి నాయుడు విమర్శించారు. బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రామాంజినేయులు ఆధ్వర్యంలో 'ఫీజు ఎక్కడ కంస మామా' గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందని పరిస్థితి నెలకొందన్నారు. రామాంజినేయులు, బోయ తేజ మాట్లాడుతూ... పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తున్నా విద్యా వ్యవస్థలో మార్పులు లేవన్నారు. అమ్మఒడి పథకం ద్వారా 15 వేలు ఇస్తా అని చెప్పి దానిలో కోతలు విధించారని విమర్శించారు. నియోజకవర్గ అధ్యక్షులు బెస్త జయ సూర్య, ప్రధాన కార్యదర్శి బల్లేకల్‌ సూర్య, రమేష్‌ మాట్లాడుతూ... నిబంధనల పేరిట రాష్ట్రవ్యాప్తంగా పేద, మద్యతరగతి విద్యార్థులకు ఎలాంటి విద్యా పథకాలు అందని పరిస్థితి ఉందన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యదర్శులు నూర్‌ బాష, సాయి, మహేష్‌, మహబూబ్‌, కరీం, ధర్మ, హేమంత్‌, దిలావర్‌ పాల్గొన్నారు.