ప్రధానోపాధ్యాయుడికి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు
ప్రజాశక్తి-కర్లపాలెం: మండలంలోని చింతాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బదిలీలలో భాగంగా తోట వెంకటరాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. వెంకటరాజు గతంలో లంకెవానిదిబ్బలో విధులు నిర్వహించారు. చింతా యపాలెంలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌ఎం శ్రీనివాసరావు ను పాండురంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో నూతన హెచ్‌ఎమ్‌కు ఎన్‌సిసి విద్యార్థులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా గణపవరం హెచ్‌ఎంగా శ్రీనివాసరావు వచ్చారు. గణపవరంలో విధులు నిర్వహిస్తున్న హెచ్‌ఎం లక్ష్మీ సామ్రాజ్యం ముత్తాయపాలెం వెళ్లారు. కార్యక్రమంలో పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు వ్యాయామ ఉపాధ్యాయులు మద్దెన గోపి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










