అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
ప్రజాశక్తి - తాళ్లరేవు
గ్రామంలో ఉన్నత చదువులు చదివే యువకులకు యువకులకు చేయూతనందిస్తానని ప్రముఖ వైద్యులు చెక్కా సింహాచలం (చలం) అన్నారు. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం సిద్ధార్థ నగర్ లో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైద్యులు చెక్కా సింహాచలం మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లాల్న్న వారికి ఆర్థికంగా సహకారం అందిస్తానని తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కె.ఎస్. శ్రీనివాస్, మోకా మధుబాబు, దడాల ఇజ్రాయిల్, మాత నాగభూషణం, బాబా యువ జన సంఘం కార్యకర్తలు ప్రవీణ్, నాని, రాహుల్, మహిళలు పాల్గొన్నారు.










