ప్రజాశక్తి-పాడేరు టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ కార్యాలంయలో అంబేద్కర్ చిత్రపటానికి ఇన్చార్జ్ సబ్ కలెక్టర్, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పిఒలు ప్రభాకరరావు, వేంకటేశ్వరరావు, పరిపాలనాధికారి హేమలత, పిహెచ్‌ఒ అశోక్, డిఎస్‌ఒ అప్పారావు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్:మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మతోన్మాద బీజేపీని అధికారం నుండి గద్దె దించాలని పిలుపునిచ్చారు. సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, నాయకులు పొద్దు బాలదేవ్, కొర్రా మగ్గన్న, టీ.హరి పాల్గొన్నారు.
డుంబ్రిగూడ: మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ ఈశ్వరి, జెడ్పిటిసి సిహెచ్ జానకమ్మ, సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్ బి పోతురాజు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి సూర్యనారాయణ, యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.నారాయణ, ఎస్.బాలకృష్ణలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
రంగిలిసింగిలో గుంట సీమ సర్పంచ్ జి.నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పి.డుంబులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు కే సుబ్బారావు, ఎం.స్వామి, ఏం.సింహాద్రి, మాజీ జెడ్పిటిసి ఎం.శ్రీరాములు, వైసీపీ మండల అధ్యక్షుడు ఎస్ గోపాల్, ప్రతాప్, అర్జున్, సీతారాం, పరశురాం, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట: స్థానిక పెట్రోల్ బంకు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కృష్ణారావు. సర్పంచ్ ఆర్.రమేష్ పాల్గొన్నారు.
అరకులోయ: మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం అరకులోయ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరకులోయ తహసిల్దారు వేణుగోపాలరావు, రెవెన్యూ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సంఘం, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వి.త్రినాథ్, పద్మావతి గార్డెన్ మేనేజర్ లకే బొంజు బాబు, కూడా సింహాద్రి, అప్పన్న, లైకోన్, ఆనంద్, పట్టాసి ప్రసాద్, ప్రతాప్ కుమార్, కొర్రా మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం:రంపచోడవరం ఐటిడిఎ సమావేశ మందిరంలో ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీవో సిహెచ్. శ్రీనివాసరావు. పరిపాలనాధికారి డిఎన్వి రమణ. పీహెచ్‌ఓ కే చిట్టిబాబ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చైతన్య, డాక్టర్ రాధిక ఇతర అధికారులు పాల్గొన్నారు. రంపచోడవరం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కారం సురేష్ బాబు, పెంటపాటి అనంతమోహన్ పాల్గొన్నారు.
రాజవొమ్మంగి :ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యాన నాయకులు కార్యకర్తలు రాజవొమ్మంగిలో అంబేద్కర్ చిత్రపటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్థానిక సర్పంచ్ జి రమణి, ఎంపీపీ జి.వెంకటలక్ష్మి, జెడ్పిటిసి వి జ్యోతి, ఆయా సంఘాల నాయకులు వి బాలకృష్ణ, టి సూరిబాబు, మోర్తా బుజ్జి, పి కిరణ్, కామరాజు పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మారేడుమిల్లి యూత్ ఆధ్వర్యంలో బోదులూరు రోడ్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ జాకబ్, జడ్పిటిసి సభ్యులు గొర్లె బాలాజీ బాబు, వైస్ ఎంపీపీ లక్కొండ రవి కుమార్, అఖిల పక్ష నాయకులు సత్తి సత్యనారాయణ రెడ్డి, భీసెట్టి అప్పాజీ, సత్యనారాయణ రెడ్డి, యూత్ నాయకులు అనిల్ ప్రసాద్ పాల్గొన్నారు.
చింతూరు : మండల కేంద్రంలో అంబేద్కర్ చిత్ర పటానికి అనుసూచిత్ జాతి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు చదలవాడ కృప కుమార్, దాసరి వెంకటరమణ పూస శ్రీను, ఎస్సీ హాస్టల్ వార్డెన్ తాతాజీ, ఉపాధ్యాయులు శామ్యూల్ పాల్గొన్నారు. చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ రత్న మాణిక్యం, కళాశాల సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మోతుగూడెం : చింతూరు మండలం మోతుగూడెం జగదాంబ సెంటర్లో ఎపిఎస్‌ఇబి ఎస్‌సి, ఎస్‌టి అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పొన్నూరు గ్రామంలో పేద విద్యార్థులకు సీలేరు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ బి శ్రీధర్ చేతుల మీదగా పుస్తకాలు పెన్సిల్లు పెన్నలు చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దూలపల్లి బాబురావు,. భీమవరం బాలకృష్ణ నరసింహ పాల్గొన్నారు.
విఆర్ పురం : మండలంలోని రేఖపల్లి సచివాలయం వద్ద సర్పంచ్ పూనం సరోజినీ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం సత్యనారాయణ, సచివాలయ సెక్రటరీ శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
కొయ్యూరు : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయ సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదమాకవరం సచివాలయంలో ఉద్యోగులు శ్రద్దాంజలి ఘటించారు.
సీలేరు : జీకే వీధి మండలం సీలేరులో ఎస్టి ఎస్సి అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వమించారు. ఏపీ జెన్కో ఎస్‌ఈ కేకేవి.ప్రశాంత్ కుమార్, ఈఈ లక్ష్మీనారాయణ, సిఆర్‌పిఎఫ్ 42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సురేష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీటీసీ పిల్ల. సాంబమూర్తి, పాల్గొన్నారు. జీకే వీధి మండలం దారకొండ, సీలేరు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద దారకొండ సర్పంచి నడిగట్ల రాజు, సీలేరు ఇన్‌ఛార్జి సర్పంచ్ కే వల్లి ప్రసాద్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.










