ఓ సమాజమా...
రాజకీయ యోనిలో ఉన్మాదులు
ఉద్బవిస్తున్నారు..
మనుషుల మధ్య మంటరేపుతున్నారు
మసీదులకు మందిరాలకు
మలినపు నెత్తురు పూస్తున్నారు..
ఓ శివలింగమా..
నీది ఏ కులమో
కుళ్లిన ఎముకలతో కులుకుతున్న
రాబందు రాజకీయులకు తెలుపు..
ఓ మసీదు..
నీది ఏ మార్గమో
మార్గమే లేని మొండాలతో
మొండిగా మొరుగుతున్న అర్థంపర్థంలేని శునకాలకు తెలుపు..
సమాజం చేసుకున్న కర్మ..
అవినీతి పట్టాతో ప్రాణమున్న శవాలు
మనుషులను, మానవత్వ మనుగడలను
పీక్కుతింటున్నాయి..
ఓ మనిషి
ఉన్మాదులను ఉరితీయడం మరవకు..
ఓటే నీ దగ్గరున్న తాడు..
ఒక్కసారి సరిగ్గా ఉపయోగించి చూడు
నీ ఓటుతోనే పోతుంది సమాజపు గోడు..
అభిరామ్, 97041 53642