న్యూఢిల్లీ : 'సముద్ర తీర భద్రతను మెరుగుపరచడంలో - అంతర్జాతీయ సహకారం' కార్యక్రమంపై సోమవారం వర్చువల్ వేదికగా అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లోని సభ్యదేశాల దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు, కీలక ప్రాంతీయ సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. యుఎన్‌ఎస్‌సి బహిరంగ సమావేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారత ప్రధాని మోడీ అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సముద్ర తీరంలో పెరుగుతున్న దాడులు, అభద్రతపై చర్చించి.. పలు తీర్మానాలు చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఏదేమైనా, సముద్ర తీర భద్రతపై ఒక అజెండాతో అత్యున్నత స్థాయిలో బహిరంగ చర్చ జరపడం ఇదే మొదటిసారని తెలిపింది.